ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు వాయిదా.. ఎందుకంటే ?

by Harish |   ( Updated:2021-09-09 10:50:21.0  )
ola
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఓలా తన మొదటి ఈ-స్కూటర్ విక్రయాలను సెప్టెంబర్ 15కు వాయిదా వేస్తున్నట్టు సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. గతవారం గురువారం నుంచి కంపెనీ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు జరుగుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే, ఓలా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాల కారణంగా మొదటిదశ ఈవీ విక్రయాలను వారం రోజులు వాయిదా వేస్తున్నామని భవిష్ వివరించారు. దేశీయ ఎలక్ట్రానిక్ వాహన విభాగంలో సంచలంగా మారించ్ ఓలా ఇటీవలే రెండు వేరియంట్లలో స్కూటర్లను తీసుకొచ్చింది. వీటికి బుకింగ్‌లు కూడా రికార్డు స్థాయిలో వచ్చాయి. అక్టోబర్ నుంచి వీటి డెలివరీలను అందించనున్నట్టు కంపెనీ ఇదివరకే స్పష్టం చేసింది.

అయితే, వినియోగదారులు కొనుగోలు చేసేందుకు నిర్దేశించిన తేదీకి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం ఎదురవడంతో దీన్ని సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. ‘ఓలా ఎస్1 వేరియంట్ ఈ-స్కూటర్‌ను అనుకున్న సమయానికి ప్రారంభించాలని అనుకున్నాం. అయితే, కొన్ని సాంకేతిక లోపం ఏర్పడటంతో దీన్ని వాయిదా వేస్తున్నామని’ భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Next Story