Ola వినియోగదారులకు శుభవార్త.. డ్రైవర్లు ఇక అలా చేయడానికి కుదరదు!

by Harish |   ( Updated:2021-12-23 08:03:38.0  )
ola
X

దిశ, వెబ్‌డెస్క్: రైడ్-హెయిలింగ్ Ola, రైడ్ క్యాన్సిలేషన్‌ల సంఖ్యను తగ్గించడానికి కొత్త ఫీచర్‌ను తీసుకోచ్చింది. డ్రైవర్‌లకు ఇకపై కస్టమర్‌ క్యాబ్‌/బైక్ బుక్‌ చేసిన వివరాలు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేసింది. డ్రాప్ లొకేషన్‌, పేమెంట్‌ వివరాలన్నీ సదరు డ్రైవర్‌కు ముందుగానే కనిపిస్తాయి. రైడ్‌ తనకు అంగీకారమైతే ప్రొసీడ్‌ కావొచ్చు. లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.

ఇంతకు ముందు డ్రైవర్‌లు నిర్దిష్ట ప్రదేశానికి కస్టమర్లను తీసుకు వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడమే కాకుండా, చెల్లింపు విధానం పట్ల అసంతృప్తిని కలిగి ఉంటే, ప్రయాణాన్ని డ్రైవర్‌లు రద్దు చేసేవారు. దీని గురించి సోషల్ మీడియా వేదికగా కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ola యాజమాన్యం స్పందించి యాప్‌లో కొత్త మార్పులు తెచ్చింది.

Komuram Bheemudo Promo – RRR – NTR, Ram Charan

Next Story

Most Viewed