- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏడాదిలోగా 10,000 మందిని నియమించుకోనున్న 'ఓలా కార్స్'
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా రాబోయే 12 నెలల్లో 2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 15 వేల కోట్ల) మార్కెట్ విలువ సాధించేందుకు భారీగా నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించింది. సుమారు 10,000 మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇటీవల ఓలా సంస్థ వాహనాల కొనుగోలుకు ‘ఓలా కార్స్’ పేరుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా కొత్త కార్లతో పాటు సెకెండ్ హ్యాండ్ కార్లను కొనేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది నాటికి ఈ ఫ్లాట్‌ఫామ్‌ను 100 నగరాలకు విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఓలా కార్స్ ఇప్పటికే 5,000 సెకెండ్ హ్యాండ్ కార్లను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించినట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
‘ప్రస్తుత పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓలా కార్లు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పూణె, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను ప్రారంభించాము. రానున్న రోజుల్లో కోల్‌కతా, జైపూర్, చండీఘడ్, ఇండోర్ నగరాలకు విస్తరించనున్నామని కంపెనీ వివరించింది. మరో రెండు నెలల్లో ఓలా కార్స్ సేవలు 30 నగరాలకు విస్తరిస్తుందని, వచ్చే ఏడాది నాటికి 100 నగరాలకు చేరుకుంటామని ఓలా కార్స్ సీఈఓ అరుణ్ సిర్దేష్ముఖ్ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకే సంస్థ 10,000 మంది కొత్తవాళ్లను నియమించుకోనున్నామని, తద్వారా 2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధిస్తామని ఆయన వెల్లడించారు.