సొగసైన నానో స్ర్పేయర్

by Harish |
సొగసైన నానో స్ర్పేయర్
X

దిశ, ఫీచర్స్ : ఈ తరం యూత్.. బాడీ స్ర్పే, పర్‌ఫ్యూమ్ లేనిదే బయటకు వెళ్లట్లేదు. ఇక రోజులో రెండుమూడు సార్లు పర్‌ఫ్యూమ్ స్ర్పే చేసుకునే అలవాటు ఉన్నవారు స్ర్పే బాటిల్‌ను వెంటతీసుకెళ్లేందుకు తిప్పలు పడుతుంటారు. అలాంటి వారికోసం స్మాల్ సైజ్‌లో పర్‌ఫ్యూమ్స్ అందుబాటులోకి వచ్చినా వాటిని రిఫిల్ చేసుకునే అవకాశం మాత్రం లేదు. ఈ క్రమంలోనే మోర్డోకో కంపెనీ తాజాగా అత్యంత సొగసైన నానో స్ర్పేయర్ మెటల్ బాటిల్‌ను విడుదల చేసింది.

చూడ్డానికి చిన్నగా ఉండే ఈ బాటిల్ సామర్థ్యం 30 మి.లీ. కాగా ఇందులో లిక్విడ్ అయిపోగానే మళ్లీ నింపుకునే సౌలభ్యముంది. అంతేకాదు ఈ కరోనా కాలంలో శానిటైజర్‌ లిక్విడ్ ఫిల్ చేసి హ్యాండ్ శానిటైజర్‌గా కూడా వాడుకోవచ్చు. దీనిని బైక్ కీ చైన్‌కు కూడా పెట్టుకుని స్టైల్‌గా క్యారీ చేయొచ్చు. జేబులో పెన్నుమాదిరిగా కూడా పెట్టుకోవచ్చు. ఈ మినీ స్ప్రేయర్ USB కేబుల్ పోర్టబుల్ సౌకర్యంతో పాటు అందరికీ అందుబాటు ధరలో మార్కెట్లోకి వస్తుండడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed