నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం

by Anukaran |
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ(శుక్రవారం) జరుగనున్నాయి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు 399 మంది సిబ్బందిని అధికారులు ఉపయోగించుకోనున్నారు. వారికి ఎన్నికల సామాగ్రితో పాటు మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌, శానిటైజర్లను అందజేశారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు 4 పీపీఈ కిట్లను కూడా అందజేశారు.

ఉమ్మడి నిజామాబాద్‌ వ్యాప్తంగా 824 మంది ఓటర్లకు గాను.. 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల తరపున ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మినారాయణ, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి పోటీ పడుతున్నారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఈ ఎన్నిక జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed