‘ఆశ్రమ్’ సెట్స్‌ను ధ్వంసం చేసి, డైరెక్టర్‌ను అవమానించిన భజరంగ్ దళ్..

by Shyam |
‘ఆశ్రమ్’ సెట్స్‌ను ధ్వంసం చేసి, డైరెక్టర్‌ను అవమానించిన భజరంగ్ దళ్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కమ్ బ్యాక్ ప్రాజెక్ట్ ‘ఆశ్రమ్’ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన రెండు సీజన్లు కూడా సూపర్ హిట్ కాగా.. థర్డ్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ‘ఆశ్రమ్’ థర్డ్ పార్ట్ షూటింగ్ భోపాల్‌లో జరుగుతుండగా ఎంటర్ అయిన భజరంగ్ దళ్ కార్యకర్తలు.. కోట్ల విలువైన సెట్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాదు దర్శక నిర్మాత అయిన ప్రకాశ్ ఝా పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తనపై సిరా చుక్కలు జల్లి అవమానించారు. కాగా దీనిపై స్పందించిన ‘ ది ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE)’ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింసాత్మక, వేధింపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఒక సినిమా లేదా సిరీస్ లోకల్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, ఉపాధి అందించడంతో పాటు టూరిజమ్‌ను కూడా ప్రమోట్ చేస్తుందని FWICE తన ప్రకటనలో వెల్లడించింది. అందుకే ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ జరిపేందుకు అనుమతులు లభిస్తాయని.. అలాంటప్పుడు అథారిటీస్ సదరు ప్రాజెక్ట్ సేఫ్‌టీ, సెక్యూరిటీకి గ్యారంటీ ఇవ్వాలని కోరింది. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story