- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీహరి కొడుకు మల్టీ స్టారర్ మూవీ
by Shyam |

X
లెజెండరీ యాక్టర్ శ్రీహరి జయంతి పురస్కరించుకుని కొడుకు మేఘాంశ్ శ్రీహరి.. తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. శతమానం భవతి దర్శకులు సతీష్ వేగ్నేష దర్శకత్వంలో రానున్న సినిమాలో తన కొడుకు సమీర్ వేగ్నేష, మేఘాంశ్‌లతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలిపారు డైరెక్టర్.
కాగా ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అందించిన సతీశ్.. ఈ సినిమాతో పక్కా కమర్షియల్ మూవీ చేయబోతున్నట్లు తెలిపాడు. శతమానం భవతి లాంటి చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ అవార్డు అందుకున్న సతీశ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందన్న నిర్మాత సత్తిబాబు.. త్వరలో కాస్ట్ అండ్ క్రూ గురించి పూర్తి వివరాలు అందించనున్నట్లు తెలిపారు.
Next Story