- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్కులు వద్దు.. మాకు ఫొటోలే ముద్దు
దిశ, సూర్యా పేట : శుక్రవారం రోజు జిల్లా కేంద్రంలో జరిగిన వెల్వేట్ సిజర్స్ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవ సందర్బంగా మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, కరోనా నియమ నిబంధనలు గాలికి వదిలేశారు. మాస్క్‌లు వాడాలి అని చెప్పే అధికారులే ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం మాస్క్ తీసి పక్కన పడేశారు. ఇప్పటికే లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నా ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం ప్రాధాన్యతను సామాన్య ప్రజలకు వివరించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కితే ఎలా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..
మాస్క్ లేకుండా కనిపిస్తే 1000 రూపాయల ఫైన్ ముక్కు పిండి మరి వసూలు చేస్తున్న అధికారులకు ఇంత పెద్ద ఎత్తున, కరోనా నిబంధనలను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన షాప్ ఓపెనింగ్ కార్యక్రమం కనపడలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు షాపు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.