- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిషా ఎఫ్‌సీ తొలి విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో ఒడిషా ఫుట్‌బాల్ క్లబ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. జీఎంసీ స్టేడియంలో గురువారం రాత్రి జీఎంసీ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించింది. ఆట ప్రారంభమైన 7వ నిమిషలోనే కేరళ బ్లాస్టర్స్ గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 22వ నిమిషంలో కేరళ ఆటగాడు జీక్సన్ సింగ్ ఓన్ గోల్ చేశాడు. బంతి గోల్ పోస్టులోకి వెళ్లకుండా కాపాదామనుకొని ఓన్ గోల్ చేయడంతో ఒడిషాకు గోల్ లభించింది.
ఇక తొలి అర్దభాగం ముగుస్తుందనగా 42వ నిమిషంలో స్టీవెన్ టేలర్ గోల్ చేశాడు. దీంతో ఒడిషా ఆధిక్యం 2-1కి చేరింది. ఆధిక్యంతో ఉన్న ఒడిషా క్లబ్ రెండో అర్దభాగంలో దూకుడుగా ఆడించి. సరైన పాస్‌లు ఇచ్చుకుంటూ గోల్ పోస్టుపై దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో 50వ నిమిషంలో డిగో మారీసియో గోల్ కొట్టి ఒడిషా ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. 60వ నిమిషంలో మరోసారి డిగోనే గోల్ చేయడంతో ఒడిషా ఆధిక్యం 4-1కి చేరింది. ఆ తర్వాత బంతి కేరళ బ్లాస్టర్స్‌కు చేరకుండా ఒడిషా చాకచక్యంగా వ్యవహరించింది.
అయితే 79వ నిమిషంలో కేరళ ఆటగాడు గారీ హూపర్ గోల్ చేయడంతో ఒడిషా ఆధిక్యత 4-2కు తగ్గింది. ఇరుజట్టు సమయం ముగిసే వరకు మరో గోల్ చేయలేకపోయాయి. దీంతో ఒడిషా ఎఫ్‌సీ 4-2 తేడాతో ఈ సీజన్‌లో తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు జెర్రీకి.. హీరో ఆఫ్ ది మ్యాచ్ డిగోకి లభించింది.