2022 వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై : మిథాలీ రాజ్

by Shyam |
2022 వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై : మిథాలీ రాజ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మహిళా జట్టు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్‌పై స్పష్టతనిచ్చారు. 2022లో న్యూజీలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశారు. ‘1971 ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్‌నెస్’ అనే పుస్తకాన్ని వర్చువల్ విధానంలో ఆవిష్కరించిన మిథాలీ ఆ తర్వాత పలు విషయాలు వెల్లడించారు. ‘నేను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 21 ఏళ్లు గడిచాయి. 2022 వన్డే వరల్డ్ కప్ నా ఆఖరి ప్రదర్శన అనే విషయం నాకు తెలుసు.

గత ఏడాది 20 ఏళ్ల పూర్తయిన వెంటనే రిటైర్ అవుదామని అనుకున్నాను. కానీ వన్డే వరల్డ్ కప్‌తో ముగించాలని ఆగాను’ అని మిథాలీ చెప్పారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో అందరి జీవితాలు తల్లకిందులయ్యాయి. క్రీడాకారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఏడాదికి పైగా క్రికెట్ ఆడకుండా ఉండటం చాలా కష్టం. అందులో నా కెరీర్ చరమాంకంలో ఇలా అవడం బాధకరంగా ఉందని మిథాలీ అన్నారు. కెరీర్‌లో 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. వన్డేల్లో 7 వేల పరుగుల మైలు రాయి దాటిన ఏకైక మహిళా క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కారు.

Advertisement

Next Story