- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీనరీకి కవిత డుమ్మా.. అదే కారణమా..?
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా జరిగిన ప్లీనరీకి ఎమ్మెల్సీ కవిత దూరంగానే ఉండిపోయారు. మంత్రి హరీశ్‌రావు హుజురాబాద్ పర్యటన కారణంగా దూరంగా ఉన్నాడని అర్థం చేసుకున్నా కవిత ఎందుకు హాజరుకాలేదనే చర్చ పార్టీ నేతల్లో విస్తృతంగానే జరిగింది. ఆదివారం వరకూ దుబాయ్‌లోని బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న కవిత హైదరాబాద్‌కు చేరుకున్నప్పటికీ ప్లీనరీకి హాజరుకాకపోవడం సందేహాలకు తావిచ్చింది. అయితే జ్వరం కారణంగానే ఆమె హాజరుకాలేదని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. దుబాయ్ టూర్ నుంచి వచ్చేటప్పటికే జ్వరంతో ఉన్నారని, విశ్రాంతి కోసమే ఇంటికి పరిమితమయ్యారని పేర్కొన్నారు.
పార్టీ ప్లీనరీ ఘనంగా జరిగినా కవిత కనిపించకపోవడం ఆహ్వానితులకు ఆశ్చర్యం కలిగించింది. గత కొంత కాలంగా పార్టీ ప్రోగ్రామ్‌లకు, కుటుంబపరమైన కార్యక్రమాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు పార్టీ గొప్పగా చెప్పుకుంటున్న ప్లీనరీకి సైతం ఆమె హాజరుకాకపోవడం వివాదాస్పదంగా మారింది. దుబాయ్‌లో బతుకమ్మ ఉత్సవాలకు హాజరైన నిజామాబాద్ ఎమ్మెల్యేలంతా ప్లీనరీకి హాజరైనా ఆమె ఒక్కరే కనిపించకపోవడం సందేహాలకు తావిచ్చినట్లయింది. ప్లీనరీకి హాజరుకావాల్సిందిగా పార్టీ నుంచి ఆహ్వానం అందిందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ప్లీనరీకి దూరంగా ఉన్నారా లేక జ్వరం కారణంగానే రాలేకపోయారా అనే అనుమానం మాత్రం కంటిన్యూ అవుతోంది.