- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన కాన్వే
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లో లార్డ్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజీలాండ్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతున్నది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనా ఓపెనర్ డేవొన్ కాన్వే సెంచరీతో కదం తొక్కాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు టామ్ లాథమ్ (23), డేవన్ కాన్వే కలసి 58 పరుగులు జోడించారు. కెప్టెన్ కేన్‌విలియమ్‌సన్ (13) అండర్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రాస్ టేలర్ (14) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పోయాడు. అయితే డేవన్ కాన్వే, హెన్రీ నికొలస్ కలసి న్యూజీలాండ్ ఇన్నింగ్ చక్కదిద్దారు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కున్న కాన్వే 163 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన 109వ బ్యాట్స్‌మాన్ కాన్వే. ఇక న్యూజీలాండ్ తరపున అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన 12వ బ్యాట్స్‌మాన్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన నాలుగవ క్రికెటర్‌గా కాన్వే రికార్డులకు ఎక్కాడు. అంతకు ముందు రూథర్‌ఫర్డ్ (న్యూజీలాండ్), కుక్ (సౌతాఫ్రికా), గంగూలీ (ఇండియా) ఉన్నారు. ఇంగ్లాండ్‌పై గంగూలీ 1996లో అరంగేట్రం సెంచరీ చేయగా.. పాతికేళ్ల తర్వాత కాన్వే ఆ ఘనత సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లు ముగిసే సరికి న్యూజీలాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. కాన్వే (121), నికొలస్ (33) పరుగులతో క్రీజులో ఉన్నారు.