కివీస్ 348 పరుగులకు ఆలౌట్

by Shyam |
కివీస్ 348 పరుగులకు ఆలౌట్
X

భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్ 348 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 183 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు ఆటలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ గ్రాండ్ హోమ్(43), జైమీసన్(44) ధాటిగా ఆడి ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అనంతరం జైమీసన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. చివరిలో ట్రెంట్ బౌల్ట్ (38) ఐదు ఫోర్లు, సిక్సర్‌తో విజృంభించడంతో కివీస్ భారీ స్కోర్ చేసింది. ఇక భారత బౌలర్లలో ఇషాంత్ (5), అశ్విన్ (3), షమి(1), బుమ్రా(1) వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story