బయటకు వస్తున్న నూతన్ నాయుడు మోసాలు !

by srinivas |
బయటకు వస్తున్న నూతన్ నాయుడు మోసాలు !
X

దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల విచారణలో నూతన్‌ నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్‌ పదవి ఇప్పిస్తానని ఓ రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు, అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని మరో వ్యక్తి వద్ద రూ.5లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఇక పోలీసులు కస్టడీలోకి తీసుకునే ముందు డ్రామాకు తెరలేపిన నూతన్ నాయుడు కడుపు నొప్పి లేస్తుందని చెప్పాడు. అయితే వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story