ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

by Anukaran |
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నాలుగైదు రోజుల నుంచి 5వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 69,463మందికి పరీక్షలు నిర్వహించగా 3,892మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,465కి చేరింది. 28మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,319కి చేరింది. ప్రస్తుతం 41,669 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7,19,477 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 5,050మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 67,72,273మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోగా కృష్ణా జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, కర్నూలు, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 290మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా చిత్తూరులో 405, తూర్పుగోదావరి జిల్లాలో 607, గుంటూరులో 345, కడపలో 332, కృష్ణాలో 458, కర్నూలులో 104, నెల్లూరులో 219, ప్రకాశంలో 146, శ్రీకాకుళంలో 154, విశాఖపట్నంలో 163, విజయనగరంలో 151, పశ్చిమ గోదావరిలో 518 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed