ఏపీలో 5వేలు దాటిన కరోనా మరణాలు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 70,511 మందికి పరీక్షలు నిర్వహించగా 8,846 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 83 వేల 925కి చేరింది. 69 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,041గా ఉంది. ప్రస్తుతం 92,353 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 4లక్షల 86వేల 531 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 9,628మంది కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి ప్రకాశం జిల్లాలో 10మంది ప్రాణాలు కోల్పోగా చిత్తూరులో 9మంది, అనంతపురంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, కడపలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కర్నూలులో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 299 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 272, తూర్పుగోదావరిలో 1,423, గుంటూరులో 641, కడపలో 661, కృష్ణాలో 398, కర్నూలులో 314, నెల్లూరులో 820, ప్రకాశంలో 979, శ్రీకాకుళంలో 678, విశాఖపట్నంలో 574, విజయనగరంలో 532, పశ్చిమగోదావరిలో 955 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 47లక్షల 31వేల 866మంది కరోనా పరీక్షలు నిర్వహించారు.

Advertisement