- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో కరోనా@ 3 మిలియన్లు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగం రోజురోజుకు ఎక్కువవుతోంది. కరోనా ప్రవేశించినప్పటి నుంచి దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. ఆగస్టు 7వ తేదీనే 2 మిలియన్ల మార్కుకు చేరుకున్న కేసుల సంఖ్య కేవలం 15రోజుల్లో మరో పది లక్షల కొత్త కేసులు నమోదై మొత్తం కేసులు 3మిలియన్ల మార్కును చేరడం గమనార్హం. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో భారత్ కొనసాగుతోంది. ఒక్క రోజులో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య కొద్ది రోజులుగా స్థిరంగా 70వేలకు చేరువగా నమోదవుతోంది
ఆదివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించేసరికి 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 69,239 వేల పాజిటివ్‌లు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,44,940కి చేరింది. దేశవ్యాప్తంగా ఒక్క రోజులో కరోనాతో 912 మంది మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 56,706కు చేరింది. అయితే సాయంత్రానికి పలు రాష్ట్రాల బులెటిన్‌లు విడుదలవడంతో ఈ సంఖ్య 57వేలు దాటేసింది. రోజుకు 900కు పైగా మరణాలు నమోదవుతూ ఒక్క వారంలోనే దేశంలో 5814 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ మరణాల్లోనూ ప్రపంచంలో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే సాయంత్రానికి పలు దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో21 లక్షల 58 వేల మంది కోలుకోగా 6 లక్షల 92 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 10,441 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 6,82,383కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో చనిపోయిన 258 మందితో కలుపుకొని మొత్తం మరణించిన వారి సంఖ్య 21,948కి చేరింది. ఢిల్లీలో కొత్తగా 1450 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,61,466కు చేరింది. ఇక్కడ ఒక్క రోజులో 16మంది కరోనాతో చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4300కు చేరింది. తమిళనాడులో 24గంటల్లో 5975 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,67,430కు వెళ్లింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 97మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 6517కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 7895 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 93మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 3,282 మంది ప్రాణాలు కోల్పోయారు.