- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తారక్, త్రివిక్రమ్ మళ్లీ మళ్లీ
యంగ్ టైటర్ ఎన్టీఆర్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్‌కు ఇది 30వ సినిమా కాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేలో షూటింగ్‌ను ప్రారంభించి 2021 ఏప్రిల్‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేసింది యూనిట్.
అరవింద సమేత సినిమాతో హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్… మరో సినిమాపై అధికారిక ప్రకటన చేయడంతో తారక్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందనాను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుండగా… పొలిటికల్ నేపథ్యంలో సాగే సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు సినిమా టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందట. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందట. మూవీ సూపర్ హిట్ అనే నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ రాజమౌళితో సినిమా చేశాక ఆ హీరో తర్వాతి చిత్రం ఫ్లాపు అవుతుందన్న సెంటిమెంట్‌ను ఈ సినిమాతో ఎన్టీఆర్ దూరం చేస్తాడని అంటున్నారు. కాగా… అల వైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని గురూజీపై నమ్మకంతో ఉన్నారు.