- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెట్స్‌పైకి.. ‘తారక్ – ప్రశాంత్ నీల్’ ప్రాజెక్ట్
దిశ, సినిమా :రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తర్వాత.. ఇక ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా లేనట్లే అనుకున్నారు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌తో వస్తున్నామని ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలు ఈ విషయాన్ని స్పష్టం చేయగా.. తారక్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ 30, ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ ‘సలార్’ ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఎన్టీఆర్31గా వస్తున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్న ఈ సినిమా చిత్రీకరణ 2022 ఎండింగ్‌లో స్టార్ట్ అయ్యే చాన్స్ ఉందని తెలిపారు.
So….finally I know how it feels like to sit next to a nuclear plant….next time bringing my radiation suit to be around all that crazy energy @tarak9999
Happy birthday brother!!!
Have a safe and great day
See you soon…#HappyBirthdayNtr#stayhomestaysafe— Prashanth Neel (@prashanth_neel) May 20, 2020
ఈ అప్‌డేట్‌తో ఇంతకు ముందు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలిసినప్పుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో తారక్‌ను న్యూక్లియర్ ప్లాంట్‌తో పోల్చిన డైరెక్టర్.. ఈ క్రేజీ పవర్ చుట్టూ తన రేడియేషన్ ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని తారక్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉండగా.. రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్‌తో జాయిన్ కానున్నారు ఎన్టీఆర్.