ఎన్టీపీసీ 100 బిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

by  |
ఎన్టీపీసీ 100 బిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే 100 బిలియన్ యూనిట్ల కరెంటు ఉత్తత్తి చేసినట్లు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) తెలిపింది. సెంట్రల్ ఎలక్రిసిటీ అథారిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బాలో 2600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు దేశంలోనే అత్యథిక పీఎల్ఎఫ్(97.42శాతం) సాధించిందని పేర్కొంది. దీంతో పవర్ ప్లాంట్ల నిర్వహణలో ఎన్టీపీసీ పనితనం మరోసారి నిరూపితమైందని తెలిపింది. మొత్తం 62.9 గిగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఎన్టీపీసీకి థర్మల్, హైడల్, గ్యాస్, రెన్యువబుల్ అన్ని కలిపి 70 పవర్ ప్లాంట్లు ఉన్నాయి.



Next Story