గ్లౌవ్స్, మాస్కులతో నీట్, జేఈఈ

by  |
గ్లౌవ్స్, మాస్కులతో నీట్, జేఈఈ
X

న్యూఢిల్లీ: వచ్చే నెలలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ (మెయిన్) పరీక్షలను నిర్వహించడానికి ప్రకటన విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తాజాగా, విద్యార్థులు, సిబ్బందికి మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జేఈఈ(మెయిన్), 13వ తేదీన నీట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎన్‌టీఏ మార్గదర్శకాలు

-పరీక్ష విధుల్లో ఉన్న సిబ్బంది గ్లౌవ్స్, మాస్కులు ధరించాలి
-పరీక్షలు రాసే అభ్యర్థులూ గ్లౌవ్స్, మాస్కులు ధరించాలి
-అభ్యర్థులు భౌతిక దూరాన్ని పాటించాలి, అందుకు అనుగుణంగానే సీటింగ్ ప్లాన్ ఉంటుంది
-రిపోర్టింగ్ సమయమూ ఒకేసారి కాకుండా దశలవారీగా ఉంటుంది
-ఎంట్రెన్స్ దగ్గర ప్రతిఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది
-హ్యాండ్ శానిటైజర్లు ఎంట్రెన్స్ దగ్గర, అలాగే ఎగ్జామ్ సెంటర్‌ లోపలా అందుబాటులో ఉంటాయి
-నేరుగా తనిఖీ కాకుండా, పొడవైన చేతులుండే మెటల్ డిటెక్టర్‌లతో అభ్యర్థులందరినీ తనిఖీ చేస్తారు.


Next Story

Most Viewed