- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.. ఎన్ఆర్ఐలకు టీడీపీ ఎమ్మెల్యే పిలుపు
దిశ, కృష్ణా జిల్లా ప్రతినిధి : కుటుంబ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. అట్లాంట ఎయిర్పోర్టులో దిగిన వెంటనే తానా మరియు తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆలింగనం చేసుకుంటూ ఎమ్మెల్యే రామును అభినందించారు. అనంతరం డౌన్ టౌన్ పార్క్ నుంచి అలెగ్జాండర్ డ్రైవ్ అల్ఫారేటా వరకు జై వెనీగండ్ల రాము నినాదాలతో, టీడీపీ జెండాలతో అమెరికా వీధుల్లో ఎన్నారైలు 100 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తానా మరియు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొనేందుకు వచ్చిన రాముకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ, పూల మాలలు, జ్ఞాపికలతో అభినందనలు తెలిపారు. అనంతరం ఎన్నారైలు ఏర్పాటుచేసిన విజయోత్సవ కేక్ ను రాము కట్ చేశారు.
అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్న, సర్వ సుఖాలు వదులుకొని మండుటెండలను సైతం లెక్కచేయకుండా గుడివాడ అభివృద్ధి కోసం పోరాడి గెలుపొందిన రాము విజయాన్ని ఎంత కీర్తించిన తక్కువేనని సమావేశంలో పాల్గొన్న తానా నాయకులు కొనియాడారు. మంచి లక్ష్యంతో రాము సాధించిన విజయం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని. గుడివాడ అభివృద్ధికి భవిష్యత్తులో రాము చేసే కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ నేతలు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేలా గుడివాడ ప్రజల ఆశీస్సులతో రికార్డు స్థాయి విజయం సాధించడం తనకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఇప్పటి నుంచే తనపై అస్సలు బాధ్యత మొదలైందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గుడివాడ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని అన్నారు. 20 ఏళ్ల పాటు వెనుకబడిన గుడివాడను అభివృద్ధి చేయడం తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదన్నారు.
గుడివాడ అభివృద్ధికి తాను చేస్తున్న కృషి, ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తోడుగా భవిష్యత్తులో మీరందరూ సహకరించాలని సమావేశంలో పాల్గొన్న ఎన్ఆర్ఐలకు రాము విజ్ఞప్తి చేశారు. కోలాహలంగా జరిగిన రాము అభినందన కార్యక్రమంలో తానా, తెలుగు అసోసియేషన్ సంఘాల పెద్దలు, గుడివాడ, కృష్ణాజిల్లా ప్రాంతాలకు చెందిన పలు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.