గూగుల్‌పే నిషేధంపై ఎన్‌పీసీఐ వివరణ

by  |
గూగుల్‌పే నిషేధంపై ఎన్‌పీసీఐ వివరణ
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్‌పేను ఆర్‌బీఐ నిషేధించిందనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ) అవన్నీ ఒట్టి వదంతులే అని స్పష్టం చేసింది. రిటైల్ చెల్లింపుల సాధికార సంస్థ ఎన్‌సీపీఐ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పింది. తాజాగా, ఆర్థికవేత్త అభిజిత్ మిశ్రా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సమాధానమిచ్చిన ఆర్‌బీఐ.. గూగుల్‌పే ఎటువంటి పేమెంట్ వ్యవస్థను నిర్వహించడంలేదని, అందుకే గూగుల్‌పే సంస్థ పేరును అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని పేర్కొంది. కానీ, పలు బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ చెల్లింపులతో పాటు వివిధ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్‌బీఐ వివరించింది. అయితే, ఈ వివరణలో మొదట చెప్పిన మాటలను సోషల్ మీడియాలో కొందరు విపరీతంగా ప్రచారం కల్పిస్తూ గూగుల్‌పేను ఆర్‌బీఐ నిషేధించిందన్నారు. దీంతో ప్రజల్లో లేనిపోని గందరగోళం నెలకొంది. దీంతో, ఎన్‌సీపీఐ వివరణ ఇచ్చింది. గూగుల్‌పేను థర్డ్ పార్టీ ప్రొవైడర్‌గా ఆర్‌బీఐ గుర్తించిందని, చట్టబద్ధంగానే ఉన్నాయని, లావాదేవీలన్నీ సురక్షితమని వివరించింది.


Next Story