- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంగారెడ్డి కలెక్టర్ కారు అడ్డగింత
by Shyam |

X
దిశ, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు కారును ఎన్‌పీసీ(జాతీయ ఉత్పాదక మండలి) బాధితులు అడ్డుకున్నారు. న్యాల్కల్ మండలం ముంగి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ ఉత్పాదక మండలి స్థాపన కోసం న్యాల్కల్ మండలంలోని 18 గ్రామాలు, ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాల శివారు పరిధిలో ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. అయితే ఈ భూమికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శనివారం కలెక్టర్ అక్కడికి రావడంతో బాధితులు అడ్డుకున్నారు.
Next Story