ఇంగ్లీష్ టీచర్‌ అవతారమెత్తిన ‘అలెక్సా’

by Sujitha Rachapalli |
ఇంగ్లీష్ టీచర్‌ అవతారమెత్తిన ‘అలెక్సా’
X

దిశ, ఫీచర్స్ : అమెజాన్‌ తెచ్చిన వర్చువల్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’. యూజర్లకు వర్చువల్ సర్వీస్‌ అందించడంలో పాపులర్ అయిన అలెక్సా.. స్మార్ట్ హోమ్ పరికరాల నియంత్రణతో పాటు క్యాబ్ బుకింగ్, న్యూస్ పేపర్ రీడింగ్, కంటెంట్ సెర్చింగ్ వంటి సర్వీసెస్‌ను అందించగలదు. అంతేకాదు హిలేరియస్ జోక్స్‌తో నవ్వించగలదు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే చిటికెలో లెక్కకు మించిన పనులు చేయడంలో ఎక్స్‌పర్ట్. ఈ క్రమంలోనే అలెక్సా అకౌంట్‌కు మరో కొత్త స్కిల్ యాడ్ అయ్యింది. ఇకపై అలెక్సా తన వినియోగదారులకు ఇంగ్లిష్ కూడా నేర్పించడానికి సిద్ధమైంది.

మ్యాక్ మిలన్ ఎడ్యుకేషన్ ఇండియా.. అమెజాన్ అలెక్సాపై కొత్త ఇంటరాక్టివ్ స్కిల్‌ను రూపొందించింది. ‘మ్యాక్‌మిలన్ అల్టురా’ అని పిలువబడే ఈ స్కిల్‌ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే అన్ని వయసుల వారికి ఉపయోగపడనుంది. ‘కరికులం గ్రేడ్ ఇంగ్లిష్’ లెర్నింగ్ కంటెంట్‌ను స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్‌లో అందిస్తుండగా, వొకాబులరీ బిల్డింగ్ ఎక్సర్‌సైజెస్, లిజనింగ్ కాంప్రహెన్సేషన్‌పై ఇంటరాక్టివ్ క్విజ్‌లు, 1 – 5 లెవెల్స్‌లో ఇంగ్లీష్ గ్లామర్ స్ట్రక్చర్‌ను పొందుపరిచారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ ఫార్మాట్ ద్వారా లెర్నర్స్ తమ ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ సిల్క్స్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కొత్త నైపుణ్యాన్ని అన్ని అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఎకో షో స్మార్ట్ డిస్‌ప్లేస్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌, అమెజాన్ షాపింగ్‌లో.. అలెక్సా మైక్ లేదా అలెక్సా యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు.

‘ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్‌ అన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో లెర్నర్స్ ఇంగ్లిష్ నేర్చుకునేందుకు శ్రమిస్తూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇకముందు ఎక్కడికీ వెళ్లకుండా, ఇంట్లోనే ఉండి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. ఈ తరహా విద్యను ప్రవేశపెట్టినందుకు మేము సంతోషిస్తున్నాం. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి మరిన్ని మార్పులు చేస్తాం’ అని అలెక్సా ఇండియా కంట్రీ లీడర్ పునీష్ కుమార్ అన్నారు.

Advertisement

Next Story