అత్యధిక కరోనా కేసులన్న ఎనిమిదో దేశంగా భారత్

by  |
అత్యధిక కరోనా కేసులన్న ఎనిమిదో దేశంగా భారత్
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. రోజుకు కొత్తగా ఎనిమిది వేల కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. మొత్తం 1.85 లక్షల కేసులతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. 1.83 లక్షల కేసులున్న జర్మనీని వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానానికి చేరింది. ప్రపంచంలో అత్యధిక కేసులు(సుమారు 18 లక్షలు) అమెరికాలో నమోదైన సంగతి తెలిసిందే. అటుతర్వాత బ్రెజిల్(సుమారు ఐదు లక్షలు), రష్యా(సుమారు నాలుగు లక్షల)లు అత్యధిక కేసులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్నా కొద్దీ దేశంలో కేసులు వేగమందుకున్నాయి. నాలుగో దశ సడలింపుల కాలంలోనే దేశంలోని సగం కేసులు నమోదవడం గమనార్హం. తాజాగా, లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్‌కే పరిమితం చేసిన నేపథ్యంలో దేశంలో మరిన్ని కేసులు వేగంగా రిపోర్ట్ అయ్యే అవకాశముందని తెలుస్తున్నది. అదీగాక, ఈ టాప్ 10లోని దేశాలు కొన్ని ఇప్పటికే పీక్ స్టేజ్‌ను చేరడంతో వాటిలో కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ, మనదేశం మాత్రం ఇంకా పీక్ స్టేజ్‌కు చేరలేదనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Next Story