ఆర్బీఐలో 48 జూ‌నియ‌ర్ ఇంజినీర్లు

by Harish |   ( Updated:2021-02-06 02:34:11.0  )
ఆర్బీఐలో 48 జూ‌నియ‌ర్ ఇంజినీర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆర్బీఐలో 48 జూ‌నియ‌ర్ ఇంజినీర్ ఉద్యోగాల వివరాలు..

పోస్టు పేరు: జూ‌నియ‌ర్ ఇంజినీర్లు
మొత్తం ఖాళీలు: 48 (సివిల్‌-24, ఎల‌క్ర్టిక‌ల్‌-24)
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో 65 శాతం మార్కుల‌తో డిప్లోమా (సివిల్ లేదా ఎల‌క్ర్టిక‌ల్)తోపాటు సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి.
వయస్సు: 1 ఫిబ్ర‌వ‌రి 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూసీ అభ్యర్థులకు ప‌దేండ్ల‌ గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ , లాంగ్వేజ్ ప్రొఫెషియ‌న్సీ టెస్ట్‌ ద్వా‌రా ఆన్‌లైన్ ఎగ్జామ్ 300 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్‌లో 180 ప్ర‌శ్న‌ల‌కు ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. దీనిలో జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంజినీరింగ్ పేప‌ర్‌1, ఇంజినీరింగ్ పేప‌ర్‌2 నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో కనీసం మార్కులు సాధించిన వారిని మాత్రమే లాంగ్వేజ్ ప్రొఫెషియ‌న్సీ టెస్ట్‌(లోక‌ల్ లాంగ్వేజ్‌)కు అనుమ‌తిస్తారు.
అప్లికేష‌న్ ఫీజు: SC/ST/PWD/EXS ల‌కు రూ.50, మిగ‌తా అభ్య‌ర్థుల‌కు రూ. 450
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివ‌రితేదీ: 15 ఫిబ్ర‌వ‌రి, 2021
ప‌రీక్ష తేదీ: మార్చి 8
వెబ్‌సైట్‌: www.rbi.org.in లో పూర్తి వివరాలు పొందుపరిచారు.

Advertisement

Next Story

Most Viewed