- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడల్ స్కూళ్లు పిలుస్తున్నాయి
దిశ, బోథ్ : తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహించనున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది. 6వ తరగతికి ఏప్రిల్ 15 నుంచి 30 వరకు, 8 నుంచి 10వ తరగతి వరకు ఏప్రిల్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదర్శ పాఠశాలల డైరెక్టర్ తెలిపారు. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండగా.. జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు జూన్ 18 నుంచి 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వివరించారు. జూన్ 21న తరగతలు ప్రారంభమవుతాయన్నారు. అలానే మోడల్ పాఠశాల లో సీట్ల కేటాయింపు రోస్టర్ పద్దతి ద్వారా కేటాయిస్తారు. ఇందులో రోస్టర్ ఆధారంగా ఏస్సీ లకు 15%, ఎస్టీ లకు 6%, బీసీ లకు 27%, మిగిత సీట్లు ఓపెన్ కేటగిరి లో భర్తీ చేస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75, ఇతరులు రూ. 150 ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని తెలిపారు.