- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను జోన్‌ల వారీగా విడుదల చేసింది. నిరుద్యోగుల సౌలభ్యం కోసం జోన్‌ల వారీగా వివరాలు వెల్లడించింది. ఒకేసారి 16,259 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేతో పాటు వెస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, నార్తర్న్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే 4,103 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ వంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చేనెల 3 చివరి తేదీ. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
దక్షిణ మధ్య రైల్వే
మొత్తం ఖాళీలు- 4,103 విద్యార్హతలు
ఏసీ మెకానిక్ 250 పోస్టులు.. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మెకానిక్ (R & AC) ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
కార్పెంటర్ 18 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు కార్పెంటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
డీజిల్ మెకానిక్ 531 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
ఎలక్ట్రీషియన్ 1,019 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
ఎలక్ట్రానిక్ మెకానిక్ 92 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
ఫిట్టర్ 1,460 పోస్టులు టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
మెషినిస్ట్ 71 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మెషినిస్ట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ 5 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
మిల్‌రైట్ మెయింటనెన్స్ 24 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మిల్‌రైట్ మెయింటనెన్స్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
పెయింటర్ 80 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు పెయింటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
వెల్డర్ 553 పోస్టులు. టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్.
దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 3
వయస్సు- 2021 అక్టోబర్ 4 నాటికి 15 నుంచి 24 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
నోటిఫికేషన్, దరఖాస్తుల కోసం https://scr.indianrailways.gov.in/ను ఓపెన్ చేయాలి.