ఐబీపీఎస్ క్ల‌ర్క్ 1557 పోస్టులకు నోటిఫికేషన్..!

దిశ, వెబ్‎డెస్క్:

దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ‌ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నేటి నుంచి ప్రారంభ‌ం అయింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఈ నెల 23 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. దీంతో దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో మొత్తం 1,557 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెన‌రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ ఓవ‌ర్‌సిస్ బ్యాక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌, ఇండియ‌న్ బ్యాంక్‌, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఈ పోస్టులున్నాయి. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

వీటిలో తెలంగాణ- 20, ఆంధ్రప్రదేశ్‌లో- 10 చొప్పున‌ పోస్టులు ఉన్నాయి. వీటికి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదే విధంగా కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. 20 నుంచి 28 ఏళ్ల లోపువారై ఉండాలి.

దరఖాస్తుల‌కు చివరితేదీ: సెప్టెంబర్ 23
అప్లికేష‌న్‌ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‍మెన్‌కు రూ.100.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్: డిసెంబర్ 5, 12, 13
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల: డిసెంబర్ 31
మెయిన్స్ కాల్ లెటర్స్: జనవరి 12
మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్: 2021 జనవరి 24
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2021 ఏప్రిల్ 1
వెబ్‌సైట్‌: www.ibps.in

Advertisement