బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్

by Aamani |
బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రతిష్ఠాత్మక రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనుబంధ బాసర త్రిబుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్‌లర్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి అక్టోబర్ నెల 3వ తేదీ వరకూ ఆన్లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికలాంగులు, ఇతర ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు 6వ తేదీ వరకూ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed