సునిశిత్ ఎఫెక్ట్.. యూట్యూబ్ ఛానల్స్ కు నోటీసులు

by  |
సునిశిత్ ఎఫెక్ట్.. యూట్యూబ్ ఛానల్స్ కు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో హంగామా సృష్టించిన సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. అంతేగాక, తనతో పాటు తాను వైరల్ కావడానికి సహకరించిన యూట్యూబ్ ఛానళ్లు చిక్కులో భాగస్వామ్యం అయ్యాయి. గతంలోనూ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి తనకు పెళ్లి అయిందనీ సంచలన వ్యాఖ్యలు చేయగా, అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు తాను త్యాగం చేస్తేనే ఎన్నో సినిమాలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్‌ నటులకు వెళ్లాయని.. ఎన్నో సినిమాలకు డైలాగ్‌లు రాశానని, పాటలు పాడానని తన వ్యాఖ్యలతో హల్‌చల్ చేశాడు. అయితే, అతడు ఇంతగా వైరస్ అవ్వడానికి వేదికలైన యూట్యూబ్‌ ఛానళ్లకు పోలీసులు షాక్ ఇచ్చారు.

తాజాగా గురువారం అతన్ని హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్లు తనకు తెలుసంటూ సోషల్ మీడియాలో సునిశిత్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ స్టార్ హీరోయిన్లందరూ తన లవర్స్ అంటూ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు సునిశిత్. ఈ నేపథ్యంలోనే సునిశిత్‌పై రాచకొండ కమిషనరేట్‌లో 2, కీసర కేసులు నమోదు అయ్యాయి. అలాగే తనను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.


Next Story