ఆర్థికవ్యవస్థలో మరిన్ని సంస్కరణలు : నిర్మలా సీతారామన్

by Shamantha N |
ఆర్థికవ్యవస్థలో మరిన్ని సంస్కరణలు : నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్థిక పెట్టుబడులకు హాట్‌స్పాట్‌గా భారత్‌ను నిలబెట్టేందుకు ఆర్థిక సంస్కరణలు ఊపందుకుంటాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. భారత పారిశ్రామిక వర్గాల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆమె..కొవిడ్-19 మహమారి సృష్టించిన సంక్షోభంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సంస్కరణల అంశం ముందుకొచ్చిందని, ఇది భారత్‌కు అవకాశంగా మారిందని ఆమె తెలిపారు.

కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్నప్పటికీ సంస్కరణలు వేగంగా జరుగుతున్నాయి. కేవలం బహుళజాతి సంస్థలు మాత్రమే కాదు మొత్తం పరిశ్రమలు, ఆర్థికవ్యవస్థ రీసెట్ అవనుందని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా మరింత బలోపేతం అవుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని, ఫైనాన్స్ రంగం మరింత ప్రొఫెషనల్‌గా మారుతుంది, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ఎజెండాతో కొనసాగనున్నట్టు ఆర్థికమంత్రి పరిశ్రమ వర్గాలను ఉద్దేశించి చెప్పారు. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల పన్ను దాఖలు చేసే ప్రక్రియ సడలించామన్నారు.

Advertisement

Next Story

Most Viewed