- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డబ్బుతో సాధించలేము.. ఉద్యోగాలు సృష్టించాలి’
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా డిమాండ్‌ను మెరుగుపరిచేందుకు ప్రజల చేతుల్లో నేరుగా నగదును ఇవ్వకుండా, ఉద్యోగాలను సృష్టించడం ద్వారా సాధించవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు కే వి సుబ్రమణియన్ చెప్పారు. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ 3.0తో ఆర్థికవ్యవస్థకు ఎంతమేరకు దోహదపడుతుందనే అంశంపై, లాక్‌డౌన్ సమయంలో స్వల్ప మెరుగుదల కనిపించిందని, ఈ ఉద్దీపన దానికి మరింత తోడ్పడుతుందని అన్నారు. ‘ప్రజల చేతుల్లో నగదు ఉంచడం వల్ల డిమాండ్ పెరగకపోవచ్చు. తాజాగా ప్రకటించిన ఉద్యోగాల కల్పన చర్యలు డిమాండ్‌ను పెంచుతాయి. దీనివల్ల ప్రజల్లో ఆదాయ భరోసా ఏర్పడుతుంది. ఇదే డిమాండ్‌ను పెంచుతుందని’ పేర్కొన్నారు. తయారీ రంగానికి సంబంధించి రికవరీ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సానుకూలంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా కరోనా వల్ల ఆతిథ్యం, పర్యాటక రంగాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని సుబ్రమణియన్ తెలిపారు.