2022 లో ప్రపంచానికి ముప్పు తప్పదా..! నోస్ట్రడామస్ ఏం చెప్పారు!

by Shyam |   ( Updated:2021-12-01 11:32:38.0  )
Nostradamus
X

దిశ, ఫీచర్స్: కాలజ్ఞానం చర్చకు వస్తే లేదా ఊహించని పరిమాణాలు చోటుచేసుకుంటే ‘బ్రహ్మం’ గారు ఆనాడే చెప్పారంటూ తెలుగువాళ్లు ఉటంకిస్తుంటారు. ఈ క్రమంలో భవిష్యత్‌ గురించి ముందే చెప్పిన జ్యోతిష్కుడిగా మిచెల్ డి నోస్ట్రడామస్‌కు పేరు కూడా తెరమీదకు వస్తుంటుంది. 465 ఏళ్ల కిందట తను రాసిన ‘లెస్ ప్రొఫెటీస్‌’ పుస్తకంలో వేలాది అంచనాలను పొందుపరచారు. ఈ ఫ్రెంచ్ ప్రవక్త ఊహించిన అనేక సంఘటనలు ప్రపంచ చరిత్రలో నిజమయ్యాయి. దీంతో అతను చెప్పిన విషయాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు అధ్యయనం కూడా చేస్తున్నారు. అయితే రెండున్నరేళ్లుగా కరోనా కోరల్లో చిక్కుకుని మరో నెల రోజుల్లో 2022లో అడుగుపెట్టబోతున్న వేళ.. నోస్ట్రడామస్ ఏం చెప్పారనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

1503లో దక్షిణ ఫ్రాన్స్‌, సెయింట్ రెమీ డి ప్రావెన్స్‌లో నోస్ట్రడామస్ జన్మించాడు. ఆయన రాసిన ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకం, 942 పోయెటిక్ క్వాట్రైన్స్ సమాహారం. ఇది భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా వేస్తుంది. ఈ బుక్ 1555 సంవత్సరంలో తొలిసారి ప్రచురితం కాగా, ప్రపంచ చరిత్రలో జరిగే అతిపెద్ద సంఘటనలను అందులో నోస్ట్రడామస్ ముందే ఊహించి చెప్పాడు. లండన్ గ్రేట్ ఫైర్, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, 9/11 ఉగ్రదాడులు వంటివి అందులో కొన్ని ఉదాహరణలు. ఇక 2022 విషయానికొస్తే.. ఉల్కాపాతాలు, ద్రవ్యోల్బణం, ఫ్రాన్స్ సంక్షోభం గురించి వివరించాడు.

ఉల్కాపాతం

ఉల్కల వల్ల 2022 లో అధిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని సీజర్ అంచనా వేశారు. ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని కూడా తెలిపారు.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని, US డాలర్ విలువ తగ్గ వచ్చని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నాడు.

ఫ్రాన్స్‌లో సంక్షోభం

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని.. దానివల్ల కరువు ముప్పు పొంచివుందని సూచించాడు. అలాగే 2022లో పెద్ద తుఫాను కారణంగా ఫ్రాన్స్ సంక్షోభంలో కూరుకుపోతుందని అంచనా వేశారు.

మానవులను నియంత్రిస్తున్న కంప్యూటర్లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఆధిపత్యం ఇప్పటికే పెరిగిపోయింది. రాబోయే కాలంలో సాంకేతికతే పైచేయి సాధిస్తుందని ఇప్పటికే ఎంతోమంది నిపుణులు చెప్పారు. ఇదే విషయాన్ని నోస్ట్రడామస్ అప్పుడే ఊహించాడు. కృత్రిమ మేధస్సు వైపు ప్రపంచం పరుగులు పెడుతున్న తరుణంలో.. ఇది ఎలాంటి ఉపద్రవానికి దారితీస్తుందో వేచి చూడాలి.

అయితే ఈ అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ ముప్పును ముందే తెలుసుకోవడం వల్ల అప్రమత్తమయ్యే అవకాశమైతే ఉంది.

ఓల్డ్ కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా.. ఇక మీరు కోటీశ్వరులే..!

Advertisement

Next Story

Most Viewed