రైతులకు శుభవార్త.. ఈసారి సాధారణ వర్షపాతం

by  |
రైతులకు శుభవార్త.. ఈసారి సాధారణ వర్షపాతం
X

న్యూఢిల్లీ: రైతులకు కేంద్రం తీపి కబురు తెలిపింది. ఓ వైపు కరోనా లాక్‌డౌన్ కాలంలోనూ రైతులకు మినహయింపులనివ్వగా.. మరోవైపు ఈ సారి సాధారణ వర్షపాతం ఉండనుందని శుభవార్త చెప్పిందిదేశంలో 70శాతం వర్షపాతానికి కారణమైన నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళలోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ.. ఈ సారి లాంగ్ పీరియడ్ యావరేజ్(ఎల్‌పీఏ) వందశాతంగా ఉండబోతుందని అంచనా వేసినట్టు తెలిపారు. వంద శాతం ఎల్‌పీఏ అంటే సాధారణ వర్షపాతం కేటగిరీలో పడుతుంది. ఈ నైరుతి రుతుపవనాలు జూన్ 1న దేశంలోకి ఎంటరై.. వాయవ్య రాష్ట్రాల నుంచి సెప్టెంబర్ 30వ తేదీన బయటికెళ్లిపోనున్నట్టు ఆయన వివరించారు.

మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు మూడు నుంచి ఏడు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నట్టు ఐఎండీ తెలిపింది. అయితే, తిరోగమనం మాత్రం 7 నుంచి 14 రోజులు ఆలస్యమవుతుండటంతో.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వర్షం కురిసే అవకాశముంది. మన భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై అధికంగా ఆధారపడి ఉంటుంది. అలాగే, మన సాగు ఎక్కువగా వర్షపాతంపై ఆధాపడి సాగుతుంది. వర్షాలు అనుకూలిస్తేనే రైతు కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆర్థిక వ్యవస్థ కూడా పురోగమిస్తుంది. దీంతో ఈ సారి నైరుతి రుతుపవనాలు రైతులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకాలను మోసుకొస్తున్నాయని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Tags: monsoon, IMD, meteorological dept, entry, withdraw, delay, normal, average



Next Story

Most Viewed