- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తనకు ఇస్తానని చెప్పి మోసం చేశాడంటూ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ గతంలో ఫిర్యాదు చేయడంతో.. రవీందర్‌రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
అలాగే తనకు రవీందర్ రెడ్డి రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు చెల్లించలేదని డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులలో తాజాగా ప్రత్తిపాడు మేజిస్ట్రేట్ రవీందర్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కాగా ప్రస్తుతం బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న BB3కి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ‘జయజానకీ నాయక’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలను ఆయన నిర్మించాడు.
Next Story