జీడీపీ వృద్ధి అంచనాను తగ్గించిన నోమురా

by Harish |   ( Updated:2021-05-11 10:37:44.0  )
GDP
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా 2021-22 ఆర్థిక సంవత్సరానికి భరత జీడీపీ వృద్ధి అంచనాను 12.6 శాతం నుచ్ని 10.8 శాతానికి తగ్గించింది. సెకెండ్ వేవ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో కార్యకలాపాలు దెబ్బతినడమే దీనికి కారణమని సంస్థ వివరించింది. గతవారం ఆర్థిక కార్యకలాపాలు గతేడాది కరోనా మొదలైనప్పటి స్థాయిలకు పడిపోయాయని నోమురా తెలిపింది. కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేల మరణాలు నమోదయ్యాయి. మహమ్మారిని నియంత్రించేందుకు 20కి పైగా రాష్ట్రాలు లాక్‌డౌన్, సంబంధిత కఠిన నిబంధనలను విధించాయని నోమురా పేర్కొంది.

ప్రస్తుతం తమ జీడీపీ వృద్ధి అంచనా గతేడాది జూన్ త్రైమాసికం స్థాయిని ప్రతిబింబిస్తుందని నోమురా అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్ నాటికి పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నట్టు నోమురా తన నివేదిక తెలిపింది. అలాగే, గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతినడంతో 2020-21 జీడీపీ వృద్ధి 7.6 శాతం ప్రతికూలంగా నోమురా అంచనా వేసింది.

Advertisement

Next Story