- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యురేనియం తవ్వకాలు జరగడం లేదు
by Shyam |
దిశ, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరుగుతాయన్న ప్రచారానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెరదించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ సంస్థ యురేనియం కోసం తవ్వకాలకు శ్రీకారం చుడుతుందనే వద్దంతులు జిల్లా వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ విషయంపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వివరణ ఇచ్చారు. నల్లమల అమ్రాబాద్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలే తప్ప, ఏ విధమైన యురేనియం పనులు జరగడం లేదని స్పష్టం చేశారు. వన్యప్రాణులకు త్రాగు నీటిని ట్యాంకర్ల ద్వారా అందజేసేందుకు రోడ్డు మరమ్మత్తులు మాత్రమే జరుగుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు.
Tags: Collector Sridhar, No uranium mining, Nallamala Forest, Nagarkurnool
Advertisement
Next Story