ఓల్డ్ సిటీ.. నో రూల్స్

by  |
ఓల్డ్ సిటీ.. నో రూల్స్
X

దిశ, హైదరాబాద్: కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో హోటళ్లు, షాపింగ్ మాల్స్, షాపులు, కంపెనీలు మూతపడ్డాయి. అనంతరం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా నిబంధనలతో షాపులు, హోటళ్లు, కంపెనీలు ఓపెన్ చేసుకోవచ్చని పర్మీషన్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని అన్ని కార్యకలాపాలు తిరిగి షురూ అయ్యాయి. కానీ, పాతబస్తీలో నిబంధనలు పాటించకుండా హోటళ్లు, షాపులను అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సామాజిక దూరం ఉండాలన్న నిబంధనలను పక్కన పెట్టి.. సమయ పాలన కూడా పాటించక పోవడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయని చెప్తున్నారు.

చర్యలేవి?

మొదట్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించి నేడు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా కనీసం నిబంధనలు కూడా పాటించని వారిపై చర్యలు తీసుకోకపోవడం ఎంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే కోవలో పాతబస్తీలో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచడం మూలంగా కేసులు గణనీయంగా పెరిగి పోవడానికి కారణంగా కనబడుతోంది. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా కన్పిస్తున్నారు. హోటళ్ల వద్ద అవసరం లేకున్నా గంటల తరబడి గుంపులుగా నిలబడుతున్నారు. ముఖ్యంగా మటన్ దుకాణాలు, హోటళ్లలో భౌతిక దూరం ఏ మాత్రం అమలు చేయడం లేదు. ముఖ్యంగా యువత కరోనాకు ముందు తీరులోనే ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ముగ్గురు తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాతబస్తీతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు తెరచి ఉంచే హోటళ్లు, టీ స్టాళ్లు, ఇతర దుకాణాలపై చర్యలు తీసుకుని కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో కేసులు నమోదైన తీరు


Next Story

Most Viewed