ఇంకా రెండ్రోజులే.. 18 ఏళ్లు పైబడిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ అందేనా..?

by vinod kumar |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడం సాధ్యపడదని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి టీకా కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉండగా, కేంద్రం ఆదేశాల మేరకు మే 1వ తేదీ తర్వాత 18ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారికి ఉచిత వ్యాక్సినేషన్ ఉంటుందని రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించగా.. వ్యాక్సిన్ కొరత మేరక 18 ఏళ్ల పైబడిన వారికి ఇప్పట్లో వ్యాక్సిన్ ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, తెలంగాణలో మే 1వ తేదీ తర్వాత 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తారా? లేదా అన్న విషయంపై సందిగ్దం నెలకొంది. ఎందుకంటే 18ఏళ్లు నిండిన వారందరికీ ఉచిత వ్యా్క్సిన్ ఇస్తామని సీఎం కేసీఆర్ నోటి మాటగా చెప్పారు తప్ప విధానపరమైన ఆదేశాలు ఇంకా రాలేదని సమాచారం. దీనిపై ఇంకో రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మే నెల మొదటి వారం నుంచే 18ఏళ్లు నిండిన వారికి ఉచిత టీకా అందనుంది. కాగా, ఇప్పటికే 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు టీకా తీసుకునేందుకు పెద్దఎత్తున ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed