- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేషన్ బియ్యం ఇచ్చారు.. కానీ,
దిశ, రంగారెడ్డి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఇయ్యలేదు. కానీ, వేరొకరికి ఇచ్చేశారు. ఈ ఘటన నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ లో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ కు చెందిన మంచి అంజయ్యకు స్థానికంగా తెల్ల రేషన్ కార్డు ఉంది. రెగ్యులర్ గా రేషన్ తీసుకునే షాపునకు అతను ఈ నెల 3న వెళ్లారు. కానీ, అక్కడ ఇంతకుముందే రేషన్ తీసుకున్నట్లు ఈ పాస్ యంత్రంలో చూపించింది. తాను రేషన్ తీసుకోకుండానే ఇలా తీసుకున్నట్లు చూపించడం ఏంటని షాక్ అయ్యాడు. నేను రేషన్ తీసుకోలేదని, తనకు రావాల్సిన రేషన్ సరకులు ఇవ్వాలని కోరాడు. అప్పుడు ఆ డీలర్ కుదరదని చెప్పాడు. దీంతో అతను అక్కడి నుంచి ఇంటికి వచ్చి తన కొడుకు సురేశ్ కు చెప్పాడు. అప్పుడు అతను కూడా మరికొన్ని షాపులకు తిరిగాడు. ఇలా ఎన్ని షాపుల వద్దకు తిరిగినా ఫలితం లేకపోవడంతో అతను ఆన్ లైన్ లో చెక్ చేశాడు.
దీంతో.. సమీపంలోనే ఉన్న మరో షాపులో తమకు రావాల్సిన 42 కిలోలతోపాటు ప్రభుత్వం అదనంగా ఇచ్చే బియ్యంతో కలిపి 84 కిలోల రేషన్ బియ్యం తీసుకున్నట్లు చూపించింది. దీంతో అతను ఆవేదన వ్యక్తం చేస్తూ తాను రేషన్ తీసుకోలేదని తన రేషన్ తనకు ఇప్పించాలని సివిల్ సప్లై అధికారిని కోరాడు. దీంతో ఆ అధికారి స్పందిస్తూ ఎక్కడైతే ఇలా తప్పు జరుగుతుందో ఆ డీలర్లపై చర్యలు తీసుకుంటామని, రేషన్ రెండు సార్లు తీసుకునే లబ్ధిదారులపై కూడా చర్యలు ఉంటాయని చెప్పాడు. ఈ విషయమై దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కరోనా కారణంగా రేషన్ దారులకు ఫింగర్ ఫింట్ తీసుకోకుండా రేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
పొరపాటు జరిగింది.. వచ్చి తీసుకెళ్లండి..
‘మా ఇంట్లో ఏడుగురం ఉంటాము. మేము ప్రతిసారి మొత్తం 42 కిలోల రేషన్ బియ్యం తీసుకుంటాము. ఈ నెల ఎప్పటిలాగే రేషన్ తీసుకోవడానికి వెళ్లాము. కానీ, అక్కడ డీలర్ తమ పేరుపై ఉన్న రేషన్ ఇంతకుముందే తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో మేము ఆన్ లైన్ లో చూడగా మన్సూరాబాద్ లోనే ఉన్న మరో షాపులో రేషన్ తీసుకున్నట్లు చూపించింది. కొద్ది సేపటికే వారు ఫోన్ చేసి పొరపాటు జరిగింది.. వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు’ అని బాధితుడు మంచి సురేష్ చెబుతున్నాడు.
Tags: ration, dealer, rangareddy, epass