వుహాన్‌లో ఒక్కటీ నమోదు కాలే..

by Shamantha N |
వుహాన్‌లో ఒక్కటీ నమోదు కాలే..
X

ప్రపంచానికి కరోనాను వైరస్‌ను పంచిన చైనాలోని వుహాన్ పట్టణంలో శుక్రవారం ఒక్క కేసు నమోదు కాలేదు. ఈమేరకు వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. గత డిసెంబర్ తొలిసారి ఈ వైరస్ ను గుర్తించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ వైరస్ చాలా వేగంగా విస్తరించింది. కొన్ని నెలలపాటు దీని వ్యాప్తిని వారు అడ్డుకోలేకపోయారు. దాదాపు మూడు నెలల తర్వాత వుహాన్ పట్టణంలో ఒక్క కేసు నమోదు కాకపోవటం ప్రపంచానికి శుభపరిణామం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అదనమ్ గెబ్రియెస్ అన్నారు. వుహాన్‌ పట్టణం కోలుకుంటున్నప్పటికీ కరోనావైరస్ ధాటికి ప్రపంచం విలవిలాడుతోంది. ఈ వైరస్‌తో ఇప్పటికే 11వేలమంది మృత్యువాత పడగా 2.50 లక్షల మంది దీని భారిన పడి చికిత్సపొందుతున్నారు.

Tags: no new cases in wuhan, who chief, coronavirus, virtual news to world

Advertisement

Next Story