- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోదాడ ఎమ్మెల్యేకు కరోనా రాదా.. లేక నాయకులకు నిబంధనలు వర్తించవా..?
దిశ, కోదాడ: కరోనా మహమ్మారి విజృంభిస్తూ పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తన ప్రతాపం చూపిస్తుంది. అనేకమంది కరోనా బారినపడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్ వంటి అనేక కఠిన నిబంధనలు తీసుకువచ్చినా, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అనంతగిరి మండలంలోని గొండ్రియాల కొత్తగూడెం గ్రామాలలో జరిగిన వివాహ వేడుకలకు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా ఈ వేదిక పైకి ఎక్కి వధూవరులను ఆశీర్వదించిన సమయంలో కనీసం ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మాస్క్ లేకుండానే కనిపించారు. మాస్కు పెట్టుకున్న కొంతమంది కూడా సరిగ్గా ధరించకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో ప్రజా ప్రతినిధులే ఈ విధంగా ఉంటే ప్రజలు ఎలా నిబంధనలు పాటిస్తారు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.