- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులపై లాఠీఛార్జ్ జరపలేదు: ఎస్పీ ఫక్కీరప్ప
by Mahesh |
X
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురంలోని సాయిబాబా ఎయిడెడ్ కళాశాల (ఎస్ఎస్‌బీఎన్) లోని విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ జరపలేదని ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. అనంతపురంలో గురువారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు విద్యార్థులను కొట్టనేలేదని పేర్కొన్నారు. కొందరు విద్యార్థుల లాగా ఆందోళనలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల ముసుగులో కొందరు కావాలనే రాళ్ల దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్పష్టం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌లో ఎవరు గాయపడలేదని.. గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన రాళ్ల దాడి వల్లే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి నిజాయితీగా చెప్పారని వివరించారు. కాలేజీలో జరిగిన ఘటనపై లోతుగా విచారణ చేపట్టామని తెలిపారు. కొందరు నాయకులు లేనివి ఉన్నట్లు చూపించి విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నాలు చేయడం మానుకోవాలని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు.
Advertisement
Next Story