ఏపీలో ఆస్పత్రులు లేవు: జగన్

by Anukaran |
ఏపీలో ఆస్పత్రులు లేవు: జగన్
X

దిశ, వెబ్ డెస్క్: మా రాష్ట్రంలో మహానగరాలు లేవు.. ఆస్పత్రులూ లేవని, కేంద్రం సహాయసహకరాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కోరారు. మంగళవారం కొవిడ్ నియంత్రణ చర్యలపై 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. ఏపీలో తీసుకుంటున్న నివారణ చర్యలను మోడీకి వివరించారు. సాధ్యమైనంత త్వరగా కేసులను గుర్తిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని, ప్రతి పది లక్షల మందిలో 47,459 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు జగన్ వివరించారు. మా రాష్ట్రంలో మహానగరాలు లేవు.. ఆస్పత్రులూ లేవు, అందువల్ల కేంద్రం సహాయసహకరాలు అందించాలని ఆయన మోడీని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed