నిఘానేత్రాలకు పెంచారు..ఫ్రెండ్లీ పోలీసింగ్ కు తుంచారు

by Shyam |
MInister Harish rao
X

దిశ, న్యూస్ బ్యూరో
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు చేసిన బడ్జెట్ కేటాయింపులపై మిశ్రమ స్పందన లభిస్తోంది. పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన వైపుగా నడిపిస్తామన్న అధికార పార్టీ తన వాగ్ధానానికి ప్రాధాన్యత తగ్గిస్తుందేమోనని అనుమానాలు కలగకమానవు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న కాలంలో ఐటీ, సాంకేతిక నిపుణులు, పరిశోధనలకు ఎక్కువ కేటాయింపులు అవసరం. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫ్రెండ్లీ పోలిసింగ్ పోలీస్ స్టేషన్ల నిర్వాహణ కేటాయింపుల్లో భారీ కోత విధించడం గమనార్హం..
సిటీజన్ ఫ్రెండ్లీ సర్వీస్ పోలీస్ స్టేషన్ల కోసం..

సీసీ కెమెరాలకు భారీగా కేటాయించినా..

సైబరాబాద్ కమిషనరేట్ కోసం 2108-19 బడ్జెట్లో రూ.2.7కోట్ల కేటాయించారు. 2019-20, 2020-21 బడ్జెట్లలో కేవలం రూ.ఒక లక్ష మాత్రమే కేటాయించినట్టు బడ్జెట్ కాపీలు చెబుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ కోసం 2108-19 బడ్జెట్లో రూ.56 లక్షలు కేటాయించగా 2019-20 బడ్జెట్లో రూ.7లక్షలు, 2020-21 బడ్జెట్ లో రూ. రెండు లక్షలు మాత్రమే కేటాయించారు. నగరంలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల కోసం భారీగా రూ. 50 కోట్లు కేటాయించారు. సైబరాబాద్ లో మాత్రం కేవలం రూ.లక్షకు పరిమితమవడం గమనార్హం.. 2018-19 బడ్జెట్లో ఇది రూ.4.50 కోట్లు కేటాయించారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల కోసం గత బడ్జెట్లో రూ.60 లక్షలు కేటాయించగా ఈ సారి కేవలం రూ.5లక్షలకు పరిమతమయ్యింది.

సైబర్ వింగ్ పై పెట్టని దృష్టి..

సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో పోలీసులకు అవసరమైన ఐటీ, సైబర్ వింగ్ విభాగాలు మరింత యాక్టివ్ గా పనిచేయాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టిసారించినట్టు కనిపించడం లేదు. ఐటీ, డేటీ అనాలిటిక్స్ కోసం రాచకొండకు రూ. 4లక్షలు, సైబరాబాద్ కు రూ.లక్ష (2018-19 బడ్జెట్లో3.74 కోట్ల కేటాయింపు), హైదరాబాద్ కు రూ. పది లక్షలు కేటాయించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి సైబర్ క్రైం పరిష్కారాలకు అవసరమైన సహాయాన్ని పోలీసులకు అందేవిధంగా చూడాల్సిన అవసరం ఉంది.

tags;ts budget,For the development of the police system,hyderabad,cyberabad, rachakonda

Advertisement

Next Story

Most Viewed