- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు పీహెచ్‌సీలో కానరాని వైద్యుడు
దిశ, మునుగోడు: నల్గొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అయితే, ఆ వ్యాధి లక్షణాల గూర్చి వివరించగానికి, తగు జాగ్రత్తులు చెప్పేందుకు మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ మిర్యాల వెంకన్న ఆవేదన వ్యక్తం చేశాడు. మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో బాధిత కుటుంబాలను పర్యవేక్షించడానికి, వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి సూచించడానికి డాక్టర్ లేరని వాపోయాడు. ఈ విషయాన్ని ఎన్నిమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు పీహెచ్‌సీలో వైద్యుడి నియామకం జరగలేదన్నారు. ఇది వరకు నియమించిన డాక్టర్ సెలవులపై వెళ్లడం లేదా డిప్యూటేషన్ పై వేరే ప్రాంతాలకు పంపించడం జరుగుతోందని సర్పంచ్ వివరించాడు. ఇకనైనా పూర్తిస్థాయి వైద్యుడిని నియమించాలని మునుగోడు సర్పంచ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.