ఎన్ఆర్సీ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

by Shamantha N |
ఎన్ఆర్సీ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) అమలు చేయడానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జనగణన, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్)లపై నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ రూపొందించిన రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఈ ప్యానెల్ సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగతస్థాయి సమాచారం రహస్యంగా ఉంటుందని, అగ్రిగేటెడ్ డేటా మాత్రమే అవసరాల రీత్యా శాఖలకు అందిస్తామని వివరించింది. గత జనగణన నిర్వహించిన విధానంలోనే ఈ సారి కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్దమొత్తంలో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొంది. జనగణన, ఎన్‌పీఆర్‌లకు సంబంధించిన ప్రశ్నావళిని ముందస్తుగానే విజయవంతంగా పరీక్షించామని తెలిపింది. ఇప్పటి వరకు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ జాబితా రూపొందించే నిర్ణయాలేవీ ఇంకా తీసుకోలేదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed