- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్చువల్ ‘బాల్ డ్రాపింగ్’ ఈవెంట్
దిశ, వెబ్‌డెస్క్: పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి.. నయా సాల్‌కు స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. అయితే న్యూ ఇయర్‌ను ఆహ్వానించేందుకు వివిధ దేశాలు పలు సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తుంటాయి. అలా చేస్తే కొత్త సంవత్సరంలో తమ జీవితం ఆనందమయంగా సాగుతుందని వారి నమ్మకం. కానీ ఈ ఏడాది కొవిడ్ నిబంధనల కారణంగా ఆయా సంప్రదాయాలకు బ్రేక్ పడనుండగా, యూఎస్ మాత్రం ‘బాల్ డ్రాప్’ ట్రెడిషన్‌ను కొనసాగించనుంది. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎక్స్‌పెడిషన్ 64 క్రూ కూడా ‘బాల్ డ్రాపింగ్’ చేసి ప్రజలందరికీ ‘హ్యాపీ న్యూ ఇయర్’ తెలిపారు. మరి అమెరికా బాల్ డ్రాప్ ఎలా జరపనుంది? ఐఎస్ఎస్‌లో బాల్ డ్రాప్ ఎలా సాధ్యమైంది?
న్యూఇయర్ వేడుకల సందర్భంగా న్యూయార్క్‌లోని ‘టైమ్ స్క్వేర్’లో జరిగే వరల్డ్ డ్రాపింగ్ ఈవెంట్ అద్భుతంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు అడుగుల చుట్టుకొలతతో సుమారు వెయ్యి పౌండ్ల బరువు ఉండే వాటర్‌ఫోర్డ్ క్రిస్టల్ బాల్‌ను జెండా స్తంభం మీద ఉంచుతారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 11:50 గంటలకు ఆ బంతి కిందకు జారడం మొదలు కాగా, సరిగ్గా 12 గంటలకు నేలను తాకుతుంది. అంతే ఒక్కసారిగా వినువీధుల్లో మిరుమిట్లు గొలిపే క్రాకర్స్ వెలుగుల నడుమ ప్రజలంతా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ వేసే కేకలతో టైమ్ స్వ్కేర్ దద్దరిల్లిపోతుంది. ప్రతి ఏడాది ఈ వేడుకలను చూడ్డానికి దాదాపు 10 లక్షల మంది హాజరవుతుండగా, ఈ ఏడాది మాత్రం ఎవరినీ అనుమతించడం లేదు. కానీ బాల్ డ్రాపింగ్ ఈవెంట్‌ను మాత్రం నిర్వహిస్తున్నారు. ‘1904 నుంచి ఈ ఈవెంట్ ఓ సంప్రదాయంగా కొనసాగుతుండగా, ఈ సారి మాత్రం ప్రేక్షకులెవరూ లేకుండా జరుపుతుండటంతో వర్చువల్ విధానంలో చూసే అవకాశం కల్పించారు. అంతేకాదు కొవిడ్ టైమ్‌లో తమ సేవలతో ఎంతోమంది మనసులు గెలుచుకున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు వారి కుటుంబాలను ఈ సందర్భంగా టైమ్ స్క్వేర్ వద్ద సత్కరించనున్నారు. ప్రజలంతా బాల్ డ్రాప్ ఈవెంట్‌ను టైమ్స్ స్క్వేర్ సోషల్ మీడియా పేజీల్లో లైవ్‌గా చూడొచ్చు. న్యూ ఇయర్ బాల్ డ్రాప్ వేడుక సందర్భంగా.. ప్రముఖ సింగర్ ఆండ్రా డేతో పాటల కార్యక్రమం నిర్వహిస్తున్నాట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతరిక్ష కేంద్రంలో అప్ అండ్ డౌన్స్ ఉండవని అందరికీ తెలిసిందే. అయితే, గ్లోబ్‌ను చేతిలో పట్టుకున్న ఎక్స్‌పెడిషన్ 64 క్రూ.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ ఆ గ్లోబ్‌ను విడిచిపెట్టగా అది గాలిలో తేలుతుంది. అంటే ఇది కూడా బాల్ డ్రాపింగ్ ఈవెంటే కానీ గురుత్వాకార్షణ లేని బాల్ డ్రాపింగ్ అన్నమాట. ఈ వీడియోను ఐఎస్ఎస్ అధికారిక ట్విట్టర్‌లో తాజాగా షేర్ చేయగా, ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.